గుంటూరు అంజుమన్ ఇస్లామియా ఆధ్వర్యంలో మహిళల కోసం నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో కుట్టు మిషన్ల శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. 90 రోజుల పాటు జరిగిన శిక్షణలో 67వ బ్యాచ్‌కు చెందిన 37 మంది మహిళలు శిక్షణ పొందారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.