అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఈ వారం నిర్వహించిన పశువులు, జీవాల సంతల ద్వారా రూ.4.64 లక్షలకు పైగా ఆదాయం లభించినట్లు ఛైర్పర్సన్ బల్లా పల్లవి తెలిపారు. శనివారం నిర్వహించిన గొర్రెలు, మేకలు, పొట్టేళ్ల సంత నుంచి రూ.2.61 లక్షలు వసూలయ్యాయని చెప్పారు. అలాగే ఆదివారం జరిగిన ఆవులు, ఎద్దుల సంత ద్వారా రూ.2.03 లక్షల ఆదాయం సమకూరినట్లు వివరించారు.