MDK: ఈ నెల 30న సీఐటీయూ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఊరురా జెండా ఆవిష్కరణలు జరపాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షురాలు బాలమణి అధ్యక్షతన మెదక్ కేవల్ కిషన్ భవన్లో జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక హక్కులను పెట్టుబడిదారులకు కట్టబెడుతోందని పేర్కొన్నారు.