SRD: ప్రభుత్వ పాఠశాలల్లో అసంపూర్తి భవనాలను వేసవి సెలవుల్లో పూర్తి చేయాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. అసంపూర్తి భవనాల వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ చందర్, తదితరులు పాల్గొన్నారు.