కర్నూల్ జిల్లా టీడీపీ ఇంఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు YCPపై తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారంలోకి వస్తే రఫా రఫా అంటూ తలలు నరికి ప్రాణాలు తీస్తామని వైసీపీ చెబుతుందని ఇవాళ తెలిపారు. మానవత్వం గల కూటమి ప్రభుత్వానికి, రాక్షసత్వం గల వైసీపీకి తేడాను ప్రజలు గమనించి, భవిష్యత్తులో వైసీపీకి స్థానం లేకుండా చేయాలని ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు.