AP: బీటెక్ రవి వ్యాఖ్యలపై ఎంపీ అవినాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ‘నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించం. అక్రమంగా ఇసుక అమ్ముకుని బతికేవాడివి నువ్వు. మేం అధికారంలో ఉన్నప్పుడు.. ఢిల్లీలో విజయసాయిరెడ్డి ఇంటికి ఎందుకు వచ్చావు. MLC వదిలేస్తా రూ.12 కోట్లు ఇప్పించాలని అడగలేదా? బీటెక్ రవి అక్రమాలు పులివెందుల ప్రజలకు తెలియదా? ఆయన ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారు’ అంటూ విమర్శించారు.