SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో సోమవారం అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శ్రీకారం చుట్టారు. కొడకంచి, మంగంపేట్, కొర్లకుంట, నల్తూరు గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు ఎమ్మెల్యేకు శాలువాతో ఘన సన్మానం చేశారు.