థియేటర్ల ‘పర్సంటేజీ’ వివాదం కేవలం ఒక సినిమా(పెద్ది) సమస్య కాదని, ఇండస్ట్రీ మనుగడకు సంబంధించినదని FDC ఛైర్మన్ దిల్ రాజు అన్నారు. ‘ఈ సంక్షోభంపై ఎగ్జిబిటర్లు, నిర్మాతలు చిరంజీవిని కలిసి చర్చించారు. అందరి బాధలను ఓపిగ్గా విన్న చిరంజీవి.. ఛాంబర్ కమిటీ నివేదికను పరిశీలించి, రెండు రోజుల్లో పరిశ్రమ హితం కోరేలా ఒక మంచి పరిష్కారం కనుగొంటామని భరోసా ఇచ్చారు’ అని దిల్ రాజు తెలిపారు.