KDP: మైలవరం డ్యాం ఉత్తర కెనాల్ ఉప కాల్వల్లో రూ. 38 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులను సోమవారం ప్రారంభించారు. ఈ పనులలో పూడికతీత, జంగిల్ క్లియరెన్స్, గ్రావెల్ రోడ్డు నిర్మాణం, షెట్టర్ల మరమ్మతులు చేపట్టారు. రైతులకు సాగునీటిని సకాలంలో అందించడమే ఈ పనుల ముఖ్య ఉద్దేశ్యమని డిస్ట్రిబ్యూ టరీ కమిటీ ఛైర్మన్ వెంకట జయరామిరెడ్డి తెలిపారు.