ATP: జిల్లాలో 2029 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా అక్షరాంధ్ర రెండో దశను విజయవంతం చేయాలని జేసీ విష్ణు చరణ్ ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 1,34,671 మంది నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాంధ్ర యాప్లో నమోదు చేయాలన్నారు. మే 26 నుంచి లర్నర్లు, బోధకుల అనుసంధాన ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు.