ప్రకాశం: తర్లుపాడు మండలం కలజువ్వలపాడు గ్రామంలో పారిశ్రామికాభివృద్ధికి కీలక అడుగు పడింది. రూ.15 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కును మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ పార్కు ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని వారు తెలిపారు.