PLD: చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడ్లపాడులో తొలి ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుతో స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సోమవారం ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలుతో కలిసి సీఎం చంద్రబాబు సమక్షంలో వర్చువల్గా నిర్వహించిన యడ్లపాడు ఎంఎస్ఎంఈ పార్క్ శంకుస్థాపన కార్యక్రమంలో నిర్వహించారు.