అన్నమయ్య: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక”లో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహిళలు, వృద్ధులు, వికలాంగుల ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ సూచించారు.