ASR: డుంబ్రిగుడ మండలం కురిడి పంచాయతీ కేంద్రంలోని గ్రామకంఠం భూములు ఆక్రమణకు గురవుతున్నాయని మండల పెసా కమిటీ అధ్యక్షుడు గణపతి తెలిపారు. కమిటీ నాయకులతో కలిసి సోమవారం తహసీల్దార్ త్రివేణికి వినతిపత్రం అందజేశారు. గ్రామకంఠం భూముల్లో గిరిజనేతరులు శాశ్వత గృహాలు నిర్మిస్తున్నారని, ఇది పెసా, 1/70 చట్టాలకు విరుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు.