TG: రాష్ట్రంలోని మహిళా సంఘాలకు పంపిణీ చేయనున్న ‘ఇందిరమ్మ చీరల’ సరికొత్త డిజైన్లను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. మహిళా సాధికారత, వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ చీరలను ప్రభుత్వం అందజేయనుంది. ఆకట్టుకునే రంగులు, వినూత్న డిజైన్లతో రూపొందించిన ఈ చీరలను సీఎం స్వయంగా పరిశీలించి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం మహిళా సంఘాల్లో నూతనోత్సాహాన్ని నింపింది.