కృష్ణా జలాల వినియోగం పరస్పర అవగాహనతోనే సాగాలని TG, కర్ణాటక మంత్రులు నిర్ణయించారు. ఉభయ రాష్ట్రాల ప్రయోజనాలకు, రైతులకు సానుకూలంగా ఉండేలా కొత్త ఒప్పందాలు ఉంటాయని స్పష్టం చేశారు. అంతర్ రాష్ట్ర ఇరిగేషన్ చర్చలలో వ్యక్తమైన అన్ని అంశాలను త్వరలోనే సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తామని, ఆ తర్వాతే సమిష్టిగా తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు.