AP: ఈ నెల 27, 28 తేదీల్లో హైబ్రిడ్ విధానంలో నిర్వహించే TDP మహానాడు గిన్నిస్ రికార్డు సృష్టిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా ప్రాధాన్యతే లక్ష్యంగా 1,875 క్లస్టర్లలో ఈసారి మహానాడు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ వేడుకలో 20 తీర్మానాలకు సంబంధించి 65 మంది నేతలు ప్రసంగిస్తారని తెలిపారు.