TG: సీఎం రేవంత్ రెడ్డిని అమెరికన్ తెలుగు అసోసియేషన్(ATA) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. అమెరికాలోని మేరీల్యాండ్‌లో జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్న ‘ఆటా’ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని వారు సీఎంను అధికారికంగా ఆహ్వానించారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకలకు సంబంధించిన వివరాలను ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు.