BHPL: సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా తెలంగాణ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సరస్వతి ఘాట్ వద్ద నిర్వహించిన జానపద భజన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ లింగశ్రీనివాస్ నేతృత్వంలో “లోకకళా వికాస పరిషత్” బృందం ప్రదర్శించింది. 25 మంది కళాకారులు సంప్రదాయ వాయిద్యాలతో భజనలు ఆలపించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.