TG: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలపై ఎల్నినో ప్రభావం పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోకి జూన్ 5 నుంచి 10 లోపు రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నప్పటికీ.. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఎల్నినో ఎఫెక్ట్ కొనసాగుతుందని పేర్కొంది. దీంతో ఈ మాన్సూన్ సీజన్లో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువగా, లోటు వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని అధికారులు హెచ్చరించారు.