MDK: పిల్లలలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడం, మానసిక శారీరక వికాసానికి దోహదపడడం లక్ష్యంగా వేసవి శిక్షణ ఉపయోగపడిందని హెచ్ఎం సాంబయ్య పేర్కొన్నారు. వెల్దుర్తి పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్యాంపు ముగింపు కార్యక్రమం చేపట్టారు. శిబిరం విద్యార్థులకు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, జీవితానికి ఉపయోగపడే ఎన్నో విలువైన పాఠాలను నేర్పిందన్నారు.