TPT: వరదయ్యపాలెంలో రైతులకు కడూరు సొసైటీ ఆధ్వర్యంలో సబ్సిడీ యూరియా పంపిణీ చేశారు. సొసైటీ చైర్మన్ నంద కిషోర్ రెడ్డి, వ్యవసాయ అధికారిణి గౌరీ, డైరెక్టర్లు రవి రెడ్డి, రమేష్ చేతుల మీదుగా సుమారు 450 యూరియా బస్తాలు అందజేశారు. రైతులకు సకాలంలో రుణ సహాయం కూడా అందిస్తున్నామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని నంద కిషోర్ రెడ్డి తెలిపారు.