NTR: విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ దేవస్థానం ఘాట్ రోడ్డును మరమ్మత్తుల పనుల నేపథ్యంలో మంగళవారం నుంచి జూన్ 12 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ సమయంలో భక్తులు కనకదుర్గానగర్ వైపు ఏర్పాటు చేసిన లిఫ్ట్ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి వెళ్లాలని సూచించారు. ఘాట్ రోడ్డు మూసివేత కారణంగా భక్తులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలన్నారు.