KMM: ఖమ్మం 36వ డివిజన్లో ఇందిరమ్మ చీరల పంపిణీ జరగకుండా అధికార పార్టీ మాజీ కౌన్సిలర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈమేరకు సోమవారం ఖమ్మం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి డివిజన్ మాజీ కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ రావు ఫిర్యాదు చేశారు. డివిజన్ మహిళలకు చీరలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.