చిన్న వయసులోనే లైంగిక జీవితాన్ని ప్రారంభించే వారికి భవిష్యత్తులో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. తక్కువ వయసులో శారీరక సంబంధం కలిగిన వారిలో వృద్ధాప్య లక్షణాలు త్వరగా కనిపించే ఛాన్స్ ఉందని తేలింది. మానసిక ఒత్తిడి, ADHD, శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదముందని పరిశోధకులు తెలిపారు. దీనివల్ల జీవితకాలం కూడా తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.