KDP: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ సిద్దయ్య పేర్కొన్నారు. సోమవారం సింహాద్రిపురం మండలం కోవరంగుంటపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ల్యాబొరేటరీని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ నెలలో మలేరియా డెంగ్యూ కేసులు ఏమైనా నమోదయ్యాయా అని అడిగి తెలుసుకున్నారు.