WGL: కేయూ పరిధిలో మే 28న నిర్వహించాల్సిన యూజీ పరీక్షలు బక్రీద్ పండుగ సందర్భంగా వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య రాజేందర్ కట్ల తెలిపారు. వాయిదా పడిన పరీక్షను జూన్ 3వ తేదీన (బుధవారం) నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలు, పరీక్ష సమయాలలో ఎటువంటి మార్పులు ఉండవని, మిగిలిన పరీక్షల షెడ్యూల్ యధాతథంగా కొనసాగుతుందని తెలిపారు.