అన్నమయ్య: సుండుపల్లి మండలంలోని మడితాటమ్మ జాతర సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు 100 మంది పోలీసులతో గట్టి బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు సోమవారం రాత్రి సీఐ మస్తాన్ తెలిపారు. జాతర నిర్వహణపై ఇప్పటికే శాంతి సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామస్తులకు అవగాహన కల్పించామన్నారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా,ఐకమత్యంతో జాతర మహోత్సవాన్ని జరుపుకోవాలని సూచించారు.