KNR: కరీంనగర్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు సోమవారం రాత్రి ముమ్మర తనిఖీలు నిర్వహించారు. సీపీ గౌష్ ఆలం ఆదేశాలతో ఏసీపీ వెంకటస్వామి, ఎస్సై చేరాలు ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్‌తో కలిసి లాడ్జీలు, పాన్ షాపులు, ట్రాన్స్పోర్ట్ కార్యాలయాల్లో ఆకస్మిక సోదాలు చేపట్టారు. అనుమానస్పద పార్సిళ్లు, రికార్డులను పరిశీలించి ప్రజల భద్రత కోసం తనిఖీలు నిర్వహించారు.