PPM: గుమ్మలక్ష్మిపురం మండలం రేగులపాడు గ్రామంలో సైబర్ నేరాలు, డ్రగ్స్ వినియోగం, పోక్సో చట్టం, మహిళా భద్రత, రోడ్డు భద్రత అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ హరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సై శివప్రసాద్, ఏఎస్సై మహేష్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రొజెక్టర్ సహాయంతో డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు, సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు.