JN: నర్మెట మండల కేంద్రంలోని పీఏ సీఎస్, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం–1లో మొత్తం 80.40 క్వింటాళ్ల జిలుగ విత్తనాలు సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారి అక్కిరెడ్డి కరుణాకర్ రెడ్డి తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పచ్చిరొట్ట పంట సాగు చేసి నేల సారాన్ని పెంచుకోవాలని సూచించారు. విత్తనాల కోసం సంబంధిత కేంద్రాలను సంప్రదించాలని ఆయన కోరారు.