ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండల తీవ్రతకు సోమవారం వడదెబ్బ తగిలి 14 మంది మృత్యువాత పడ్డారు. మృతులలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వారు ఎనిమిది మంది, ఖమ్మం జిల్లాకు చెందిన వారు ఆరుగురు ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం వృద్ధులు, కూలీ పనులకు వెళ్లేవారే ఉండటంతో గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.