W.G: ఇరగవరం మండలం రేలంగి-3 ఎంపీటీసీ సభ్యుడు చీలి మెంటరాజు మండల పరిషత్తు ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో ఖాళీ భర్తీ చేసేందుకు ఎన్నికలు నిర్వహించడానికి జూన్ 4న మండల పరిషత్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ఎ. శ్రీనివాస్ తెలిపారు. సమావేశంలో సభ్యులంతా పాల్గొని మండల పరిషత్ ప్రత్యక్ష పదవికి జరిగే ఉప ఎన్నికల్లో పాల్గొనాలన్నారు.