GNTR: దుగ్గిరాల మండలం పెదపాలెంలో పెనుగాలులు సృష్టించిన అలజడికి ఆరు కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. కాలువ గట్టున ఉన్న నాలుగు రేకుల షెడ్లు, రెండు పూరిళ్ల పైకప్పులు గాలికి ఎగిరిపోవడంతో బాధితులకు నిలువ నీడ లేకుండా పోయింది. గ్రామంలో పలుచోట్ల పెద్ద చెట్లు కూడా నేలకొరిగాయి.