అన్నమయ్య: చిట్వేలులోని బ్రిడ్జి సమీపంలో సోమవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటన స్థలానికి అతి సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో భారీ ప్రమాదం సంభవించే అవకాశం కనిపించింది. రైల్వే కోడూరు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించగా హుటాహుటిన ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పారు.సకాలంలో మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది.