NDL: పగిడ్యాల శివాలయం సమీపంలోని కేసీ కెనాల్ వద్ద మంగళవారం విషాదం చోటుచేసుకుంది. ఉపాధి హామీ పనులు చేస్తున్న పెరుమాళ్ల ప్రదీప్ కుమార్(34) అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందారు. సహచరులు వెంటనే ఇంటికి తరలించారు. మృతుడికి భార్య సుజాత, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ప్రదీప్ కుమార్ అకాల మరణంతో కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు.