W.G: ఉపాధి హామీ పనుల ప్రాంతంలో కనీస సౌకర్యాలు కల్పించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల శ్రామికులు ఇబ్బందులు పడుతున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ విమర్శించారు. మంగళవారం మహాదేవపట్నంలో ఉపాధి కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఉదయం 10 గం.లకు పని అయిపోయిన 11 గం. వరకు ఎండలో ఉంచుతున్నారన్నారు.