HNK: జిల్లా మడికొండ మెట్టుగుట్ట ఆలయ ఛైర్మన్ పైడిపాల రఘుచందర్ తల్లి పైడిపాల ఎల్లమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వారి నివాసానికి చేరుకుని భౌతికదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.