TG: రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ, రేపు ఎండలు 44 డిగ్రీల పైనే నమోదవుతాయని, HYDలో మే 29 వరకు 44 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.