HYD: మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన 20 మొబైల్ ఫోన్లను పోలీసులు గుర్తించి యజమానులకు తిరిగి అప్పగించారు. ఈనెల 25న ACP వి.తిరుపతి, ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర, అదనపు ఇన్స్పెక్టర్ పి.మహేందర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. CEIR సాంకేతిక దర్యాప్తుతో మొబైళ్లు ట్రేస్ చేసినట్లు పోలీసులు తెలిపారు.