NTR: ఎండల తీవ్రత మధ్య ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ విజయవాడ బస్టాండ్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రయాణికులకు తాగునీరు, నీడ, పారిశుద్ధ్య సదుపాయాల్లో నిర్లక్ష్యం ఉండొద్దని అధికారులకు సూచించారు. తాగునీటి పాయింట్లు, సూచిక బోర్డులు వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలకు అధికారులు అందుబాటులో లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.