MDCL: రామంతాపూర్లోని CDTIలో “డీప్ అండ్ డార్క్నెట్ నేరాల దర్యాప్తు”పై ఐదు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, CAPFS నుంచి వచ్చిన 20 మంది అధికారులు పాల్గొని సైబర్ నేరాల విచారణ, డిజిటల్ ట్రాకింగ్, సాక్ష్యాల సేకరణలో ఆధునిక పద్ధతులపై అవగాహన పొందారు.