KKD: పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప సామర్లకోట మున్సిపాలిటీలో గత రెండేళ్లలో సుమారు రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. మంగళవారం అంబటి వారి తోటలో రూ.26.50 లక్షలతో నూతన రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రోడ్లు, డ్రైన్లు, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, త్వరలో రూ. 30 కోట్లతో డ్రైనేజీ ఆధునీకరణ పనులు పూర్తి చేస్తామన్నారు.