ELR: భీమడోలు మండలం గుండుగొలనులో ఆర్&బీ నిధులతో సంతమార్కెట్ నుంచి కోరుకొల్లు రోడ్డు వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్డు, కల్వర్టు పనులను ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మంగళవారం పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకుని నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.