ప్రకాశం: కనిగిరి పొగాకు యార్డ్ వద్ద మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పొగాకు ధరలను పెంచాలని, దళారీ వ్యవస్థను నిర్మూలించాలని కాంగ్రెస్ నాయకుడు నరసయ్య డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న రైతులు ఆగ్రహంతో పొగాకు కుప్పలకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. నిరసనతో యార్డ్ పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.