AP: వచ్చే ఏడాది పుష్కరాల నాటికి గోదావరి నదిని కాలుష్యరహితంగా మార్చాలని అధికారులకు డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ సూచించారు. దీని కోసం రూ.100 కోట్లను కాలుష్య నియంత్రణ మండలికి ఇవ్వాలని చెప్పారు. రాజమహేంద్రవరంలోని కాతేరును VIP ఘాట్‌గా, ముని కూడలిని మోడల్ పుష్కరఘాట్‌గా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ నిధులతో JUN 25లోపు మోడల్ పుష్కర్ ఘాట్ సిద్ధం చేయాలన్నారు.