CTR: రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గం ఏర్పడటంతో వారు కలెక్టర్ సుమిత్ కుమార్ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల అధికారి వెంకటరమణ సభ్యులను కలెక్టర్కు పరిచయం చేశారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో విస్తృతంగా రక్తదాన శిబిరాలు నిర్వహించాలని, అంబులెన్స్ సేవలు, పేదలకు సహాయ కార్యక్రమాలు, ఆరోగ్య సేవలు అందించాలని సభ్యులను కలెక్టర్ కోరారు.