TPT: గూడూరును జిల్లా చేయాలని కోరుతూ గాంధీబొమ్మ సెంటర్లో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం 175 రోజులకు చేరుకున్నాయి. భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల పెంచల్ నాయుడు మాట్లాడుతూ.. అన్ని వసతులు, వనరులు ఉన్న గూడూరును ప్రత్యేక జిల్లాగా ప్రకటించే వరకు తమ పోరాటం చేస్తాం అని పేర్కొన్నారు.