SDPT: చేర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మంగళవారం ఉదయం ఒక్కసారిగా ఇన్వర్టర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఎండల తీవ్రతకు విద్యుత్ పరికరాలు వేడెక్కడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సిబ్బంది పేర్కొన్నారు. ప్రమాద సమయంలో అక్కడ ఎవరికీ గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఇన్వర్టర్ దెబ్బతినడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది.