ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని 108 కార్యాలయంలో మంగళవారం నేషనల్ పైలట్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. EMT కొండల్ రావు మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో గోల్డెన్ అవర్లో బాధితులను ఆసుపత్రికి చేర్చడంలో 108 పైలట్ల పాత్ర కీలకమని అన్నారు. రోడ్డుపై వారు వేసే ప్రతి గేర్ ఒకరి ప్రాణాన్ని నిలబెట్టే ఊపిరిలాంటిదని పేర్కొన్నారు.